ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో మూడో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం 10.45 కు ఉప్పాడలో పర్యటిస్తున్నారు. తీరంలో సముద్రపు కోతను ఆయన పరిశీలిస్తున్నారు. అనంతరం హార్బర్ సముద్ర మొగ వద్ధ మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో వారాహి బహిరంగ సభ జరగనుంది. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి విజయవాడకు ప్రయాణమవుతారు.
![]() |
![]() |