ధర్మవరం పట్టణం రేగాటిపల్లి రైల్వే గేట్ సమీపాన బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు.రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు రేగాటి పల్లి రైల్వే గేట్ సమీపాన బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లురైల్వే పోలీసులు తెలిపారు.