ఈ నెల 7వ తేది ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాదిగల జన జాతర కరపత్రాలను ఎమ్మార్పీఎస్ నాయకులు ఎమ్మెల్యే సురేంద్రబాబు చేతుల మీదుగా బుధవారం విడుదల చేశారు. కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షుడు సాకే గురుమూర్తి మాదిగ, కళ్యాణదుర్గం టౌన్ గౌరవాధ్యక్షుడు చాంద్ బాషా, శెట్టూరు మండల అధ్యక్షుడు వెట్టి తిప్పేస్వామి పాల్గొన్నారు.