ఉత్తర నియోజక వర్గాన్ని గంజాయి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. జీవీఎంసీ 51వ వార్డు పరిధి ఈస్ట్ పార్క్ లో 39లక్షల76 వేల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి వార్డు కార్పొరేటర్ రెయ్యివెంకటరమణ తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.