ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఖరీఫ్ ప్రారంభమైంది వర్షం కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. గత జూన్ మాసంలో మృగశిర కార్తి ప్రారంభంలో అరకొర వర్షాలు కురిసాయి. దీంతో మండలంలో రైతులు పొలాలు దుక్కులు దున్ని పంట సాగుకు సిద్ధం చేశారు. సేద్యానికి సిద్ధం చేసిన రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. వాతావరణ శాఖ వారు మాత్రం ఇదిగో వర్షం అదిగో వర్షం అంటూ ప్రకటనలు అయితే చేస్తున్నారు. కానీ వర్షం కురవడం లేదు.