రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి భరత్ కు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కు బుధవారం హనుమాన్ జంక్షన్ లో జనసేన పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడ పర్యటనకు వెళుతున్న ఇరువురుకి గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు.