అంగన్వాడి కేంద్రాల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆటపాటలతో కూడిన పౌష్టిక ఆహారం అందించనున్నట్లు కనిగిరి మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పాతూరులో ఉన్న మూడు అంగన్వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యాభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పిల్లల యొక్క శారీరక దారుఢ్యాన్ని పెంచేందుకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తుందన్నారు.