హనుమంతునిపాడు మండలం వేములపాడులో విద్యుత్ తీగలు తగిలి లారీ క్లీనర్ మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన తిప్పస్వామి సోమవారం తెల్లవారుజామున వర్షం కురుస్తుండటంతో లారీలో లోడ్ చేసిన ఎరువు తడవకుండా పట్ట కప్పుతున్నాడు. చీకట్లో అతనికి విద్యుత్ తీగ మెడకు తగలడంతో మృతి చెందాడని ఎస్సై నాగరాజు తెలిపారు. మంగళవారం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు.