కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందాలని గజపతినగరం సబ్ డివిజన్ ఏడిఏ కె. మహారాజన్ అన్నారు. బుధవారం గజపతినగరం మండలంలోని పాతబగ్గాం గ్రామంలో కౌలు రైతుల గుర్తింపు కార్డులపై అవగాహన సదస్సు జరిగింది. కౌలుకు వ్యవసాయం చేస్తున్న రైతులు నమోదు చేసుకుని గుర్తింపు కార్డులు పొందాలి అన్నారు. ఏవో ధనలక్ష్మి, వి. ఏ. ఓ ప్రవీణ్, టిడిపి జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు.