జామి మండలం కొట్యాడ, కిర్ల గ్రామాల మీదుగా విజయనగరం కు వెళ్లే బస్సును ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి బుధవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఎన్నికల్లో తాను కొట్యాడ తదితర గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం మారుమూల గ్రామాల ప్రజలకు కల్పించాల్సిన రోడ్డు రవాణా సౌకర్యాలను గాలికొదిలేసిందని విమర్శించారు. బస్సు సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.