తాగుడుకు బానిసైన వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన బుధవారం కురుపాం మండలం గుంజరాడ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గుంజరాడ గ్రామానికి చెందిన బిడ్డిక రవి(34) మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో అతని భార్య సీతమ్మ మద్యం మానాలంటూ రవిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన రవి ఇంట్లో ఉన్న కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవిని భద్ర గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పార్వ తీపురంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. రవికి మోక్షిత, అఖిల, నాని అనే ముగ్గురు చిన్నపిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.