బిహార్‌లో మరో వంతెన కూలిపోయింది. సరన్ జిల్లాలో గండకి నదిపై ఉన్న వంతెన గురువారం ఉదయం కూలిపోయినట్లు జిల్లా మెజిస్ట్రేట్ అమన్ సమీర్ తెలిపారు. ఇది 15 ఏళ్ల నాటి వంతెన అని చెప్పారు. కాగా, సరన్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో వంతెనలు కూలడం ఇది మూడోదిగా పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ, జేడీయూ పాలిత బిహార్‌లోనే వరుసగా వంతెనలు కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 15 రోజుల్లో ఏకంగా 10 వంతెనలు కూలిపోయాయి.