3.52ఎకరాల్లో ఇల్లు, కార్యాలయం నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న జనసేనానికి ఇక్కడే మరో 16ఎకరాల వరకూ భూమిని కొనుగోలు చేయనున్నారనే సమాచారం ఆసక్తికరంగా మారింది. ఇప్ప టికే ఈ విషయంపై రైతులతో మాట్లాడి మౌఖిక ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. పవన్‌కల్యాణ్ సొంతంగా ఈ భూములు కొంటున్నారా లేక కుటుంబసభ్యులు, స్నేహితులా అనేది ఇంకా బయటకు రాలేదు. పవన్ ఎన్నికల ప్రచార సమయంలో దేశ, విదేశాల్లో స్థిరపడిన తన సన్నిహితులు, అభిమానులు ఇక్కడ సాఫ్ట్‌వేర్ లేదా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తానని ప్రకటించారు. అప్పట్లో సాఫ్ట్‌వేర్ రంగంలో పలువురు ఎన్‌ఆర్‌ఐలు ఇక్కడ ప్రచారం కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ కంపెనీల ఏర్పాటుకు ఇక్కడ ఏమైనా భూములు తీసుకుంటున్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది.