గోదావరి జలాలను శుద్ధిచేసి పట్టణవాసులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం కొవ్వూరు కృష్ణారావు చెరువు నుంచి జగనన్నకాలనీ లేఅవుట్ 1కు వెళ్లే రహదారికి రూ.10 లక్షలు మున్సిపల్ నిధులతో పనులను ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్ బావన రత్నకుమారి గురువారం ప్రారంభించారు. ఈ సదర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జగనన్నకాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయని, అరకొర నిధులతో అరకొర సౌకర్యాలు కల్పించారన్నారు. రోడ్డంతా గుంతలు పడి అధ్వానంగా తయారయ్యిందన్నారు. లేఅవుట్-2లో ఆరికిరేవుల రోడ్డు నుంచి కాలనీ వరకు 20 విద్యుత్ దీపాలను కొత్తగా వేశామన్నారు. త్వరలో గోదావరి జలాలను శుద్ధిచేసి కొవ్వూరు పట్టణ, పరిసర గ్రామాలకు తాగునీరుగా అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. గోదావరి పుష్కరాల సమయం సమీపిస్తున్నందున పట్టణంలో అంచెలంచెలుగా సౌకర్యాలను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో సూరపనేని చిన్ని, బొండాడ సత్యనారాయణ, పొట్రు మురళీ, డేగల రాము, గంగుమళ్ళ స్వామి, కె.నవ్య, పాల్గొన్నారు.