శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల పరిధిలోని దుప్పలవలస లోని డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ గురుకుల పాఠశాల/ కళా శాలలోని పలు వురు విద్యార్థు లు కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఈ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పా ఠశాలకు సరైన ప్రహరీ లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు బయటకు వెళ్లి పాస్ట్‌ఫుడ్స్ తీసుకోవడంతో రెండు రోజులుగా ఐదుగురు విద్యార్థులు కడుపునొప్పితో బాధపడుతున్నారు. వెంటనే పాఠశాల సిబ్బంది వీరిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కి తరలించి అవసరమైన చికిత్స అందించి, తిరిగి పాఠశాలకు తీసుకువచ్చా రు. ఈ క్రమంలో గురువారం కూడా మరో ఐదుగురు విద్యార్థులకు కడుపు నొప్పి అంటూ ఇబ్బందిపడడంతో వీరిలో ముగ్గుర్ని ఆసుపత్రికి పంపించి పరీక్షలు నిర్వహిం చారు. ఇద్దరు విద్యార్థులకు మాత్రం పాఠశాలలోనే చికిత్స అందించారు. కడుపునొప్పి గురైన విద్యార్థులు పాఠశాలలోనే క్షేమంగానే ఉన్నారని ప్రిన్సిపాల్ బోర బుచ్చిరాజు తెలిపారు. నాలుగు రోజుల కిందట ముగ్గురు విద్యార్థులు తీవ్రమైన కడుపునొప్పి రా వడంతో రిమ్స్‌కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అపెండిసైటీస్‌గా వైద్యులు గుర్తించి శస్త్ర చికిత్స చేశారు. అనంతరం వారిని ఇంటికి పంపించామని ప్రిన్సిపాల్ చెప్పారు. కాగా డీఎంహెచ్‌వో బొడ్డేపల్లి మీనాక్షి, పొన్నాడ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీ సర్స్ శేషగిరిరావు, సౌమ్యశ్రీ గురువారం పాఠశాలను సందర్శించారు. వసతి గృహాన్ని, గురుకుల పరిసరాలను పరిశీలించి ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆరోగ్యం గా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఫీల్డ్ ఆఫీసర్ జగన్నాఽథం, సూపరింటెండెంట్ డేవిడ్ తదితరులు వీరితోపాటు ఉన్నారు.