ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత ఇసుక అమలు చేయడం విప్లవాత్మకమైన చర్యగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి ప్రశంసించారు. నిధుల కొరతతో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్నా ఎలాం టి వెనుకడుగు వేయకుండా సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం సీఎం చంద్రబాబుకే చెల్లిందని కితాబిచ్చారు. మంగళవారం నగరిపల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జేపీ వెంచర్స్‌ను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు రూ.వేల కోట్లు విలువ జేసే ఇసుకను దోచుకున్నారని విమర్శించారు. చౌకగా ఇసుక అందబా టులోకి రావడంతో భవన నిర్మాణ కార్మికులకు ఐదేళ్ళ తరువాత భారీ ఉపశమనం లభించిందన్నారు. కూటమి మ్యానిఫెస్టోకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతామని వివరించారు.