గాజువాకలో షీలానగర్‌లోని తిరుమల బాలాజీ దివ్య క్షేత్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శనివారం ఉదయం సందర్శించారు. ఆలయంలో స్వామికి విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ. దేవాలయాలు వసుదైక కుటుంబ స్ఫూర్తి భావనను పెంచే కేంద్రాలని అన్నారు. మనసు ప్రశాంతతకు ఆధ్యాత్మిక భావన ఉండాలని పేర్కొన్నారు.