మూలపేట పోర్టులో నిర్వాసిత గ్రామాలైన మూలపేట, విష్ణుచక్రంలకు చెందిన 17 మందిని ఉద్యోగల నుంచి తొలగించడంపై శుక్రవారం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పోర్టు నిర్మాణానికి భూములిచ్చి సర్వస్వం కోల్పోయిన తమను ఉద్యోగాల నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. పది రోజుల పాటు మూలపేట గ్రామస్థులకు పనులు నిలుపుదల చేయాలని యాజమాన్యం చెప్ప గా అందరికీ పనులు నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని నిర్వాసితుందరికీ ఉద్యోగాలు కల్పించాలని డీజీఎం ఉమామహేశ్వర రావును కోరినట్లు సర్పంచ్ జీరు బాబూరావు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగ కుండా టెక్కలి సీఐ చంద్రమౌళి, నౌపడ ఎస్‌ఐ కిశోర్ వర్మ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.