ఆషాడ మాసం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారికి సారే సమర్పించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పడతాయనే నేపథ్యంలో ఘాట్ రోడ్ను అధికారులు నిలిపివేశారు. కనకదుర్గనగర్ నుంచి భక్తులు సారెను తీసుకెళ్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలు వీకెండ్స్ కావడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల తాకిడితో రోడ్లపైన వాహనలు నిలిచిపోతున్నాయి. ఇంద్రకీలాద్రికి సరైనటువంటి పార్కింగ్సౌ కర్యం లేకపోవడంతో భక్తులు రోడ్లపైనే వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.