విజయవాడ నగరంలో శుక్రవారం నిర్వహించిన జగన్నాథ రథయాత్ర భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తుల కోలాహలం నడుమ వైభవంగా సాగింది. బందరు రోడ్డులోని డీ అడ్రస్ మాల్ నుంచి రథయాత్ర ప్రారంభమై నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. కార్యక్రమంలో మం త్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) పాల్గొన్నారు. పూరీలో జగ న్నాథ యాత్రను చూడలేని నగర ప్రజలు ఈ యాత్రను చూసి స్వామి అశీస్సులు పొందుతున్నా రని వారు అన్నారు. భగవద్గీతను ప్రతీ ఒక్కరూ పఠించాలనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు చేస్తున్న కృషి అభినందనీ యమని అన్నారు. జిల్లాలో శ్రీకృష్ణుడి మందిరం నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు. విశేష పూజల అనం తరం స్వామి రథోత్సావాన్ని తాడులాగి ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. రథయాత్ర నగరంలో పీవీపీ మాల్, పాలిక్లినిక్ రోడ్డు, ఫన్‌టైం రోడ్డు, పంటకాలువ రోడ్డు, కృష్ణవేణి రోడ్డు మీదుగా స్క్యూ బ్రిడ్జి దగ్గర ఇస్కాన్ మందిరం వరకు సాగింది. జడ్పీ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కోమటి జయరామ్, పాతూరి నాగభూషణం ఇస్కాన్ మందిర అధ్యక్షుడు చక్రధారిదాస్ పాల్గొన్నారు.