ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ తనయుడి వివాహ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ శుభ్ ఆశీర్వాద్ వేడుకలకు చంద్రబాబు నాయుడు దంపతులు, పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను చంద్రబాబు దంపతులు, పవన్ కళ్యాణ్ ఆశీర్వదించారు. అనంతరం ముకేష్ అంబానీతో చంద్రబాబు, పవన్ ముచ్చటించారు. ఇదే కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులతోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముచ్చటిస్తూ కనిపించారు.