రాయదుర్గం హెరిటేజ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్. హులికుంటి మూర్తి, సంయుక్త కార్యదర్శి గుడేకోట శివకుమార్ ఆదివారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుని కలిసి వినతి పత్రం ఇచ్చారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో గల కోటముఖ ద్వారం జీర్ణోదరణ పనులు చేపట్టాలని, రైల్వే స్టేషన్ కొత్త భవనం ప్రారంభించాలని, ఎక్స్ప్రెస్ రైల్లు రాయదుర్గంలో ఆపాలని, కదిరి- దేవరపల్లి తిరుపతి రైలును తిరిగి పునరుద్ధరించాలని కోరారు.