సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాచర్ల ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ ఉదయభాను అన్నారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ దోమల వల్ల సోకే వ్యాధులు, వాటి నియంత్రణ, నీటి నిల్వ పద్ధతులు, స్వీయ రక్షణ పద్ధతులు, స్వచ్ఛమైన వాతావరణం, తాగునీరు ప్రాధాన్యత గురించి అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. జాగ్రత్తలు పాటించి సీజనల్ వ్యాధులను తరమి కొట్టాలని సూచించారు.