గొట్కూరు గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పనులపై జరిగిన సమావేశం రసాభాసగా సాగింది. గత రెండు రోజుల క్రితం సమావేశం నిర్వహించగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో సోమవారం సాయంత్రం తిరిగి నిర్వహించారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉపాధి పనులు చేయకుండా కొందరు బిల్లులు తినేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చెప్పిన వారికి అధికారులు బిల్లులు చేశారంటూ మండిపడ్డారు. దీంతో సమావేశం రసాభాసగా సాగింది.