గుంతకల్లు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. జితేంద్ర గౌడ్ సోమవారం అమరావతిలోని సచివాలయానికి వెళ్ళి రాష్ట్ర మంత్రి మంత్రులతో భేటీ అయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ లను మర్యాద పూర్వకంగా కలసి ఆయన పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు టిడిపి గుత్తి నాయకులు రవిశంకర్, కురువ సురేష్ ఉన్నారు.