బొమ్మనహల్ కర్ణాటక హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర జలాశయంలో నీరు 33. 074 టీఎంసీలకు చేరిందని అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పది రోజులుగా ఇన్ఫ్లో హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం జలాశయంలో105. 788 పిఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి గాను 33. 074 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉందన్నారు. ఇన్ ఫ్లో ఆగడంతో బొమ్మణహల్ ఆయకట్ట రైతన్నలు ఆందోళనలు వ్యక్తం చేశారు.