రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ లో వెలసిన రుక్మిణీ పాండురంగస్వామి ఆలయంలో ఈనెల 18వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు. ఈ నెల 17న ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 5గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం, విష్ణుసహస్రనామావళి, కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 7: 30కు పల్లకి ఉత్సవం, రాత్రి 10 నుంచి ఉదయం 18వ తేదీ ఉదయం 6గంటల వరకు భజన కార్యక్రమం ఉంటాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa