శ్రామిక మహిళలకు అత్యంత అధ్వాన్నమైన దేశాల్లో భారత్ ఒకటి. దేశంలో మహిళల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. గత ఏడాది జూన్‌లో 15.1 శాతంగా ఉన్న మహిళల నిరుద్యోగ రేటు ఈసారి జూన్‌లో 18.5 శాతానికి ఎక్కువైంది. కాగా, పురుషుల విషయానికి వస్తే.. గత ఏడాది జూన్‌లో 7.7 శాతంగా ఉండగా ఈ జూన్‌లో 7.8 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ(CMIE) నిర్వహించిన సర్వేలో తేలింది.