‘‘అయిననూ పోయి రావలె హస్తినకు’’ అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన తమరు..ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు అని ప్రశ్నించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి … బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నారని నిలదీశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా.. మోడీతో గానీ ,ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేక పోయారని ఏపీసీసీ చీఫ్ అడిగారు.