హస్తినకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు.. కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రమంత్రికి వివరించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని వెల్లడించారు. అస్తవ్యస్థ నిర్వహణ, అవినీతి కారణంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని అమిత్‌షాకు బాబు తెలియజేశారు. అనంతరం సీఎం అధికారిక నివాసం (1, జన్‌పథ్)లో పూజలు నిర్వహించి విజయవాడకు తిరుగుపయనమయ్యారు. ఢిల్లీ పర్యటనలో సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కే. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కేశినేని చిన్ని తదితరులు ఉన్నారు.