విశాఖ నగరంలో మందుబాబులు బరితెగిస్తున్నారు. మొన్న కానిస్టేబుల్ అప్పారావు ఘటన మరువకముందే మంగళవారం అర్ధరాత్రి తాజాగా మరో సంఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించిన మందుబాబులు మంత్రిగారి తాలూకా అంటూ హల్ చల్ చేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల పేరుతో బెదిరించారు. మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తులపై పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. దీంతో మందుబాబులు ఊగిపోయారు. ఎస్ఐ, సీఐ, సీపీలను విఆర్కు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే మాకవరపాలెం మండలంలో గిడుతూరులో ఓ మాజీ వలంటీర్ మంగళవారం వీరంగం సృష్టించాడు. 108 సిబ్బందితో కలిసి సచివాలయ సిబ్బంది వైద్య శిబిరం నిర్వహిస్తుండగా అక్కడికి వచ్చి మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. టేబుళ్లను తిరగేసి మందులను చెల్లాచెదురు చేశాడు. దీనిపై పోలీసులకు సచివాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు.