భూ హక్కు చట్టం రద్దును స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. గత ప్రభుత్వం మొండి వైఖరితో భూ హక్కు చట్టాన్ని తెచ్చిందన్నారు. ఉచిత ఇసుక వల్ల స్థానిక నాయకులు, మంత్రులు జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచుకోవద్దని సూచించారు. వైజాగ్ భీమిలిలో ఎర్రమట్టి దిబ్బలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ పాలనలో 1.75 లక్షల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం మంచిదేనని సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యానించారు.