‘‘గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా ? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించ గలిగారా ? పోలవరం ప్రాజెక్ట్ కి నిధులపై స్పష్టత ఇచ్చారా ? రాజధాని నిర్మాణం పై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా ? “ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న.. దాటక బోడి మల్లన్న “. ఇదే బీజేపీ సిద్ధాంతం. బాబు గారు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచింది. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు అడుకుంటుంది అని గుర్తిస్తే మంచిది’’ అంటూ వైఎస్ షర్మిల హితవుపలికారు.