ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటినుండి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 18, 2024, 09:15 AM

జనసేన కార్యకర్తల ఆరోగ్య పరిరక్షణపై పార్టీ ఎంతో బాధ్యతతో ఉందని ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. పెద్దాపురం స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమ నిర్వహణకు సంబంధించి నిర్వహిం చిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈనెల 18 నుంచి 28 వరకూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగు తుందన్నారు. కార్యకర్తలు రూ.500 చెల్లించి రూ.5 లక్షల వరకూ ప్రమాద బీమా పొందవచ్చని తెలిపారు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కార్యకర్త ఆరోగ్య పరిరక్షణపై ప్ర త్యేక దృష్టి సారిస్తున్నారని, క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. కార్యక్ర మంలో జనసేన నాయకులు పొలమరశెట్టి సత్తిబాబు, ఒబిలిశెట్టి గణేష్‌, తమనార లక్ష్మణ దివాకర్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com