అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక గ్రామంలో చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో ప్రారంభించారు. సిద్ధేశ్వర ఆలయంలో తెల్లవారుజామున కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం చేపట్టిన చెన్నకేశవ ఆలయంలో కూడా ఆలయ అర్చకులు, వేదపండితులు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ఆలయ సూపరింటెండెంట్ వై.హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ బాలాజీ, గ్రామ సర్పంచ్ గౌరీశంకర్, గ్రామ పెద్దలు అదృష్ట్టదీపుడు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.