ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం తెలిపారు. బుధవారం మండలంలోని మడితాడు గ్రామ పంచాయతీ వానచపల్లి, దిగువ బిడికీలో రూ.4 లక్షలు ప్రభుత్వ నిధులు వెచ్చించి తాగునీటి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన బాలసుబ్రమణ్యంకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామదేవత ఆలయంలో టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజమ్మ, ఈవోపీఆర్‌డీ సురేశ్‌బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీనాధ్‌రెడ్డి, టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లునాయుడు, సురేశ్‌నాయుడు, రామచంద్ర, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.