ఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు అభిప్రాయపడ్డారు. అయన మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దాడులు హత్యలు దారుణంగా పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు. దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. దాడులు చేస్తున్న వారికి ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు.