బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర హోం మంత్రి అనిత తెలిపారు. విశాఖలో ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు అధికారులను అప్రమత్తం చేశామన్నారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో ఇప్పటికే మాట్లాడానని తెలిపారు.