ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు స్థిరాస్తి దారులకు మేలుచేకూరుతుందని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో శుక్రవారం ఆయన మాట్లాడుతూప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసి వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం అభినందనీయమని బిజెపి నేత పాలూరి తెలిపారు.