గుంటూరు జిల్లా పెదకాకాని మండల కేంద్రంలో శుక్రవారం మండల తహసిల్దార్ రత్నం కందిపప్పు, బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధరల స్థిరీకరణలో భాగంగా ప్రభుత్వం వినియోగదారులకు తక్కువ ధరలకు కందిపప్పు, బియ్యాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. సి ఎస్ డి టి భువనేశ్వరి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.