గుంటూరు జిల్లా చేబ్రోలు మండల కేంద్రంలో గ్రామ దేవత శ్రీ రాములమ్మ తల్లి దేవాలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దంపతులు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పసుపు కుంకుమ, చీరే, జాకెట్టు, గాజులు , నైవేద్యం సమర్పించారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించాలని అమ్మవారికి మొక్కుకున్నానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో చేబ్రోలు మండల కూటమి శ్రేణులు పాల్గొన్నారు.