గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీ కూపీ లాగుతోంది. అక్రమాలు జరిగిన తీరుపై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో వాసుదేవరెడ్డి పాత్రపై సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వం వాసుదేవరెడ్డికి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ, డిస్టిలరీల కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. వాసుదేవరెడ్డికే నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ క్రమంలో మద్యం కొనుగోళ్లలో అతను భారీ అవకతవకలకు తెర లేపినట్లు సమాచారం.