కర్నూలు నగరాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని మంత్రి టీజీ భరత్ అన్నారు. గురువారం నగరంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాదిరిగా తమ తెలుగు దేశం ప్రభుత్వ పాలనలో కమిషన్లు తీసుకునే వారెవ్వరూ తమ వద్ద లేరని, కాంట్రాక్టర్లు తీసుకున్న పనులు సక్రమంగా పూర్తి చేసి ప్రజలకు ఇవ్వాల న్నారు. నగరంలోని వార్డుల్లో తిరిగి ప్రజలతో మాట్లాడి సమస్యలన్నీ తెలుసుకున్నామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు కమ్యూనిటీ హాల్స్‌ను నిర్మిస్తే ..గత ప్రభుత్వం వాటిని సచివాలయాలుగా మార్చేసిందని, అందుకే ప్రజల కోసం మళ్లీ కమ్యూనిటీ హాల్స్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 23వ వార్డు శ్రీరామ్ నగర్‌లో రూ.20 లక్షలతో సీసీ డ్రైనేజీ కాలువలు, రూ. 39లక్షలతో సీసీ రోడ్లు, 17వ వార్డులో చణక్యపురి కాలనీలో రూ.70 లక్షలతో కమ్యూనూటి హాల్, 15వ వార్డు బుధవారపేటలో శ్మశానవాటికలో రూ. 70 లక్షలతో మౌలిక సదుపా యాల కల్పనకు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి మంత్రి శంకుస్థాప నలు చేశారు. దాదాపుగా రూ. 2 కోట్ల నిధులకు సంబంధించి మంత్రి తొలిసారి అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కార్పొరేటర్లు పరమేష్, కైప పద్మాలతారెడ్డి, పల్లవి, శివమ్మ, అదనపు కమిషన ర్ రామలింగేశ్వర్, ఎంఈలు షాకీర, శేషసాయి, ఏఈలు జనార్దన్, భాను, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు