కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎన్టీఆర్ బిల్డింగ్స్‌లో మొదటి అంతస్థు నుంచి కింద పడి నాగభూషణం (35) అనే సెంట్రింగ్ కూలీ దుర్మరణం చెందాడు. స్థానిక బిర్లాగడ్డ కాలనీకి చెందిన ఈయన సెంట్రింగ్ పని చేస్తుంటాడు. రోజు మాదిరిగానే గురువా రం కూడా భవన నిర్మాణ పనికి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో మొద టి అంతస్థు నుంచి ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.