గత రెండు రోజులుగా ఏలూరు పశ్చిమ ఏజెన్సీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాలలో పొంగిన కొండ వాగుల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ మండలాల్లో కొండవాగుల ఉధృతికి ప్రజా రవాణా నిలిచిపోయింది. దోరమామిడి వద్ద అలివేరు డ్యాం వద్ద నుంచి దిగువకు కొనసాగుతున్న వరద నీరు పారుతోంది. పట్టెన్న పాలెం వద్ద జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి పలు కాలువల ద్వారా జంగారెడ్డిగూడెం మండలం కొంగ వారి గూడెం ఎర్ర కాలువ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది.