వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అపాయింట్మెంట్ కావాలంటూ మూడు పేజీల లేఖను జగన్ రాశారు. రాష్ట్రంలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని.. శాంతి భద్రతలు క్షీణించాయని.. ఏపీలో తాజా పరిస్థితులను మీ దృష్టికి తీసుకొచ్చేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ మాజీ సీఎం జగన్ ఓ లేఖను రాశారు. రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని.. ప్రభుత్వ యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందని జగన్ రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొందని.. అత్యంత అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయంటూ లేఖ ద్వారా జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.