నిరుద్యోగం గురించి పేపర్లలో వచ్చిందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఉద్యోగాల కోసం వలసలు వెళ్తున్నారని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. ధరలను స్థిరీకరించలేకపోతున్నారని.. చిత్తూరులో కిలో టమాట 100 రూపాయలు అమ్ముతున్నారన్నారు. 2019 లో 2 లక్షల 65 వేల కోట్లు అప్పులు చూపిస్తే.. జగన్ హయాంలో 14 లక్షల కోట్లుగా చేశారన్నారు. నెలకు 9 వేల కోట్లు వడ్డీలు కట్టాల్సి వస్తోందన్నారు. జగన్ చేసిన ఘనమైన పని 14 లక్షల కోట్లు అప్పులు చేయడమని చింతా మోహన్ ఎద్దేవా చేశారు. అన్ని లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏమన్నా అభివృద్ధి చేశారా? అని నిలదీశారు. దీనిపై లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందన్నారు. అప్పుల నుంచి రాష్ట్రాన్ని ఎలా బయటకు తెస్తారో చంద్రబాబుకే తెలియాలన్నారు. విభజనలో ఇచ్చిన హామీలను ఈ ఐదు సంవత్సరాల్లో అయినా సాధించుకోవాలని తెలిపారు.అమరావతి, పోలవరం ఎలా కడతారో చూడాలని చింతా మోహన్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. నిర్వాసితులకు చంద్రబాబు, జగన్ లు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. చంద్రబాబు అమరావతి , పోలవరం పూర్తి చేస్తారని చెబుతున్నారన్నారు. తనకైతే నమ్మకం లేదు కానీ.. పోలవరంపై ఖర్చు ఎంత అయిందో జ్యూడిషియల్ విచారణ చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.