వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డే తన బిడ్డకు తండ్రి అని తన భార్య శాంతియే తనకు చెప్పిందని మదన్ మోహన్ మరోసారి పేర్కొన్నారు. లీగల్‌గా ఆ బిడ్డకి తన పేరు తండ్రిగా ఉందన్నారు. విశాఖ ఆస్పత్రిలో చూస్తే పోతిరెడ్డి, సుభాష్ రెడ్డి పేరు చూసి షాక్ అయ్యానన్నారు. ఆయనకి ఫోన్ చేసి వివరాలు అడిగానని మదన్ తెలిపారు. విజయసాయి రెడ్డి అతనికి నామినేట్ పదవి ఇప్పించారని తెలిపారు.ఆ బిడ్డకి తనకూ ఎలాంటి సంబంధమూ లేదని సుభాష్ అంటున్నాడన్నారు. శాంతి మాత్రం సుభాష్ రెడ్డి ఆ బిడ్డకి తండ్రి అని చెబుతోందన్నారు. రేపు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలి కదా అని పేర్కొన్నారు. భవిష్యత్తులో తండ్రి ఎవరో తెలియని బిడ్డ అంటే అతని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డీఎన్ఏ టెస్ట్ ద్వారా ఈ సమస్య కి పరిష్కారం లభిస్తుందన్నారు. తనకు ఇద్దరు ఆడ పిల్లలని.. తన భార్య మీద అన్యాయంగా అభాండాలు ఎందుకు వేస్తానని మదన్ మోహన్ ప్రశ్నించారు. తనతో బలవంతంగా సంతకం పెట్టించిన ఫేక్ డాక్యుమెంట్ వాళ్లు చూపిస్తున్నారని తెలిపారు. తనకు ఇటీవల తన భార్య శాంతి గురించి చాలా విషయాలు తెలిశాయని మదన్ మోహన్ పేర్కొన్నారు. ఈ ఆటలో తాను, శాంతి నలిగి పోతున్నామన్నారు. సుభాష్ రెడ్డి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాడో చెప్పాలన్నారు. విజయసాయి రెడ్డి బెదిరింపులు కారణమా? అని ప్రశ్నించారు. ఆ బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి అని శాంతినే చెప్పిందని.. భవిష్యత్తు లో సమస్య రాకుండా డీఎన్ఏ టెస్ట్‌కి కోర్టు ద్వారా అనుమతి కోరతామని మదన్ మోహన్ వెల్లడించారు.