టీడీపీ గూండా చేతిలో బుధవారం రాత్రి వినుకొండలో నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన వైయస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. రషీద్ చిత్రపటానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. రషీద్ తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దు..అండగా ఉంటానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.