అప్పులు ఎక్కువై ఓ యువకుడు రైలుకింద పడి ఆత్మహత్యకు ప్పాడిన ఘటన శుక్రవారం తాడిపత్రిలోని యల్లనూరు రైల్వేగేటు సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై తెలిపిన వివరాల మేరకు టైలర్స్ కాలనీకి చెందిన ఆంజనేయులు, సుమతిల కుమారుడు శివకుమార్(23) భవన నిర్మిణ కార్మికుడిగా విధులు నిర్వహించేవాడని తెలిపారు. ఇతను పలుచోట్ల రూ. 5 లక్షల వరకు అప్పులు చేశాడని, వాటిని తీర్చలేక క్షణికావేశంతో రైలు కిందపడి మృతి చెందినట్లు తెలిపారు.